కృష్ణా జిల్లాలో పంట పొలాల్లోకి బోల్తా కొట్టిన ఆర్టీసీ బస్సు

  • విజయవాడ నుంచి అవనిగడ్డ వెళుతున్న ఆర్టీసీ బస్సు
  • చోడవరం వద్ద బస్సుపై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
  • 15 మందికి గాయాలు
కృష్ణా జిల్లాలో ఇవాళ ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళుతున్న బస్సు పెనమలూరు మండలం చోడవరం వద్దకు రాగానే ఒక్కసారిగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దాంతో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు సామర్థ్యం మేర ప్రయాణికులు ఉన్నారు.
Go Back to Shorts
Krishna District
APSRTC
Bus

More Telugu News